శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Feb 02, 2020 , 01:52:24

ధ్యానంతోనే శివానుగ్రహ ప్రాప్తి

ధ్యానంతోనే శివానుగ్రహ ప్రాప్తి

శ్రీశైలం: నిశ్చలమైన మనస్సుతో ధ్యాన సాధన చేసిన వారికి శివానుగ్రహ ప్రాప్తి కలుగుతుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సందేశాన్నిచ్చారు. శనివారం సాయంత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల సన్నిధిలో పార్వతీ పరమేశ్వర వైభవంపై ప్రత్యేక ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వాహణాధికారి కేఎస్ రామారావు చెప్పారు. మాడవీధి కళావేదికపై జరిగిన ప్రవచన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులనుద్ధేశించి ప్రవాచకులు మాట్లాడుతూ పురాణ ఇతిహాసాల్లో శివతత్వాలలోని జనన మరణ చక్రాలతో శ్రీశైల క్షేత్రానికి ఉన్న అవినాభావ సంబందాన్ని తెలియజేప్తూ శ్రీశైల క్షేత్రానికి చేరుకొని దర్శన ప్రాప్తి కలుగవలెనంటే జన్మజన్మల పుణ్య ఫలమని భావించాలన్నారు. కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ర్టాల భక్తులతోపాటు దేవస్థాన సహాయ కమిషనర్ కోదండరామిరెడ్డి, ఈఈ భాస్కర్ మురళి, పౌరసంబందాల అధికారి శ్రీనివాసరావు, సంపాదకుడు అనిల్ కుమార్, బ్రాహ్మణ మహిళా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంకాల పద్మావతి, శ్రీగిరి శ్రీశైల పరిరక్షణ విభాగ్ సభ్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.


ధ్యానంతోనే    

పదవ తరగతి విద్యార్థులు పరీక్షా సమయంలో ధ్యానం అలవాటు చేసుకోవడంతో జ్ఞాపకశక్తి పెంపొ  మంచి ఫలితాలు సాధించవచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణులు మనోహర్ అన్నారు. శనివారం ఉదయం శ్రీశైలం ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్ధులులో భయాన్ని తొలగించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజామునే నిద్రలేవటంతో ధ్యానం అలవాటు చేసుకోవడం తప్పనిసరి అని ఆయన విద్యార్థులకు సూచించారు.  అవగాహన కార్యక్రమంలో శ్రీగిరి శ్రీశైల పరిరక్షణ విభాగ్ సభ్యులు చెన్నకేశవ, బద్రీనాయక్,ప్రవీణశర్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండురంగారెడ్డి,  పాల్గొన్నారు.

పంచలోహవిగ్రహల బహూకరణ

శ్రీశైల మహాక్షేత్రంలోఉత్సవాల్లో పూజలందు   స్వామి అమ్మవార్ల పంచలోహ ఉత్సవ విగ్రహాలను రాజమండ్రికి చెందిన అప్పల      ఇచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. విగ్రహల బరువు సుమారు 81కేజీలు ఉంటుందని దాతలు తెలిపారు.

సూర్యారాధనతో సకల రోగాలు నశిస్తాయి 

 ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని ఆరాధనతో సకల రోగాలు నశించిపోతాయని ఈవో కేఎస్ రామారావు అన్నారు. శనివారం ఉదయం ఆలయ మాడవీధిలో వందల మంది భక్తులతో కలిసి సూర్యనమస్కారాలు చేశారు. నిత్యం సూర్యనమస్కారాలు చేయడం వల్ల కలిగే లాభాలను యోగా గురువులు హనుమంతరెడ్డి వివరించారు.


logo