మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Jan 26, 2020 , 04:46:25

ప్రధాన పార్టీలకు పదికి మించని ఓట్లు!

ప్రధాన పార్టీలకు పదికి మించని ఓట్లు!
  • తలలు పట్టుకుంటున్న అభ్యర్థులు


పెబ్బేరు రూరల్‌: పెబ్బేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను కొన్ని చోట్ల ఓటర్లు దారుణంగా దెబ్బకొట్టారు. కొంతమందికి పది ఓట్లు కూడా పోల్‌ కాకపోవడమే ఇందుకు నిదర్శనం. 1వ వార్డులో టీడీపీ నుంచి తలపడ్డ దాసరి వైజయంతికి ఒక్క ఓటు పడగా, ఇండిపెండెంట్‌ అభ్యర్థి మహేశ్వరికి ఒక్క ఓటు కూడా రాలేదు. రెండో వార్డులో బీజేపీ అభ్యర్థి రామకృష్ణకు 10 ఓట్లు, సీపీఐ అభ్యర్థి శాంతమూర్తికి 3 ఓట్లు, నాలుగో వార్డు టీడీపీ అభ్యర్థి మహేశ్వరికి 4 ఓట్లు, అయిదో వార్డులో ఇండిపెండెంట్లయిన శాంతయ్య, పెద్దిగారిస్వామిలకు చెరో ఒక్క ఓటు, 8వ వార్డులో ఇండిపెండెంటు అభ్యర్థి రాఘవేంద్రకు 8 ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉండగా పెబ్బేరు మున్సిపాలిటీ 11వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన మేకల కర్రెస్వామి గతంలో పెబ్బేరు గ్రామపంచాయతీ వార్డు సభ్యుని స్థానం నుంచి సర్పంచుగా, జెడ్పీటీసీగా గెలుపొందారు.

logo