e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home ములుగు పెట్టుబడి సాయంపై అన్నదాతల ఆనందం

పెట్టుబడి సాయంపై అన్నదాతల ఆనందం

పెట్టుబడి సాయంపై అన్నదాతల ఆనందం

కేసముద్రం, జూన్‌ 15 : వానకాలానికి సంబంధించిన రైతు బంధు డబ్బు లు విడుదల చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కేసముద్రంలోని రైతు వేదిక భవనం వద్ద సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ పాలాభిషేకం చేసి, మాట్లాడారు. గత పాలకులు వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడంతో రైతు లు ఇబ్బందులు పడ్డారన్నారు. సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి బడ్జెట్‌లో రూ.వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ మర్రి రంగారావు, ఎంపీపీ ఓలం చంద్రమోహన్‌, మార్కెట్‌ చైర్మన్‌ మర్రి నారాయణరావు, జడ్పీటీసీ రావు ల శ్రీనాథ్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ దామరకొండ ప్రవీణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌, సర్పంచ్‌లు భట్టు శ్రీను, ఎన్నమల ప్రభాకర్‌, నాయకులు మోడెం రవీందర్‌, రవీందర్‌రెడ్డి, కముటం శ్రీను, నరేశ్‌యాదవ్‌ పాల్గొన్నారు. అలాగే, మార్కెట్‌లో వ్యాక్సిన్‌ శిబిరాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.

అమనగల్‌లో..
మహబూబాబాద్‌ రూరల్‌ : మం డలంలోని అమనగల్‌లో సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ చిత్ర పటాలకు జడ్పీటీసీ లునావత్‌ ప్రియాంక పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లునావత్‌ అశోక్‌ నాయక్‌, వార్డు మెంబర్లు, గ్రామ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. అలాగే, జంగిలికొండ రైతువేదిక వద్ద సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ చిత్రపటాలకు తేళ్ల శ్రీను ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పంజాల యాక సాయిలు, లునావత్‌ అశోక్‌ నాయక్‌, నర్సింగ్‌ వెంకన్న, సొసైటీ డైరెక్టర్‌ నలమాస విజయాసుధాకర్‌, గోల్కొండ శ్రీనివాస్‌, ఈశ్వర్‌, నరేశ్‌, నర్సయ్య పాల్గొన్నారు.

- Advertisement -

తొర్రూరు మండలంలో..
తొర్రూరు : మండలంలోని అన్ని క్లస్టర్ల రైతు వేదికల వద్ద సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. తొ ర్రూరు, మాటేడు, హరిపిరాల, నాంచారిమడూర్‌, అమ్మాపురం, కంఠాయపా లెం క్లస్టర్ల రైతు వేదికల వద్ద రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రామచంద్రయ్య, వివిధ గ్రామాల కోఆర్డినేటర్లు జలకం శ్రీనివాస్‌, సురేశ్‌చందర్‌రెడ్డి, ఉపాకర్‌రెడ్డి, తాళ్ల బుచ్చిరాము లు, లేగల కొమురారెడ్డి, కడారి నర్సింహారెడ్డి, నరేడ్ల శ్రీపాల్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జినుగ సురేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ రామిని శ్రీనివాస్‌, శామకూరి ఐలయ్య, దొంగరి శంకర్‌, రాయిశెట్టి వెంకన్న, పైండ్ల వెంకటయ్య, ఉప్పలయ్య పాల్గొన్నారు.

భీమ్లాతండాలో..
నర్సింహులపేట : భీమ్లాతండాలో సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు టేకుల యాదగిరెడ్డి పాలాభిషేకం చేశారు. వైస్‌ ఎంపీపీ జాటోత్‌ దేవేందర్‌, ఎంపీటీసీ అనిల్‌, మాజీ ఎంపీటీసీ విజయ, రమేశ్‌, వెంకన్న, రవికుమార్‌ పాల్గొన్నారు.

పెద్దవంగర మండలంలో..
పెద్దవంగర : మండల కేంద్రంతోపాటు చిట్యాలలో సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు జాటోత్‌ నెహ్రునాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ వెనుకదాసుల రామచంద్రయ్యశర్మ, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ సోమారెడ్డి పాలాభిషేకం చేశా రు. సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, రవీందర్‌నాయక్‌, సంజయ్‌, సుధీర్‌కుమార్‌, శ్రీనివాస్‌, లింగమూర్తి, మల్లికార్జునాచారి, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెట్టుబడి సాయంపై అన్నదాతల ఆనందం
పెట్టుబడి సాయంపై అన్నదాతల ఆనందం
పెట్టుబడి సాయంపై అన్నదాతల ఆనందం

ట్రెండింగ్‌

Advertisement