శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Mulugu - Jan 23, 2021 , 01:09:11

పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి

ఏటూరునాగారం, జనవరి 22: టీఆర్‌ఎస్‌ బలపర్చిన వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ ఎన్నికల ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి పోరిక గోవింద్‌ నాయక్‌, మండలశాఖ అధ్యక్షుడు గడదాసు సునీల్‌ కుమార్‌ కోరారు. చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలలో ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు చెందిన గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులతో టీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జిల్లా ఏర్పాటులో పల్లా రాజేశ్వర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కూనూరు అశోక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, కూనూరు మహేశ్‌, సప్పిడి రాంనర్సయ్య సిద్దబోయిన రాంబాబు, వాణి తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo