మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - May 09, 2020 , 02:48:51

తక్కువ వడ్డీకి రుణాలు

తక్కువ వడ్డీకి రుణాలు

  • డీసీసీబీ చైర్మన్‌ రవీందర్‌ రావు 

ములుగు, నమస్తేతెలంగాణ : డీసీసీబీ ద్వారా రైతులకు వ్యవసాయంతో పాటు బంగారంపై తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్లు చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు తెలిపారు. ములుగు పీఏసీఎస్‌ ద్వారా రైతులకు రుణాలను అందించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  రైతులకు ప్రస్తుతం కరోనా గోల్డ్‌లోన్లను 70 పైసల వడ్డీకి అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు డీసీసీబీ రుణంతో సబ్సిడీ వరి నాటే యంత్రాలను పొందాలన్నారు. అధికారులు సైతం రికవరీలపై దృష్టి సారించి మొండి బకాయిలను వసూలు చేయాలని సూచించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో దేవానగర్‌ గ్రామానికి చెందిన లబ్ధిదారుడికి బ్యాంకు ద్వారా మంజూరైన వరి కోత మిషన్‌ను జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, ఏఎంసీ చైర్మన్‌ పోరిక గోవింద్‌నాయక్‌, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్‌యాదవ్‌, జెడ్పీటీసీ సకినాల భవానితో కలిసి రవీందర్‌రావు అందించారు. 


logo