e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి క్రీడల్లో గెలుపోటములు సహజం

క్రీడల్లో గెలుపోటములు సహజం

క్రీడల్లో గెలుపోటములు సహజం

కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
యాడారంలో సీఎంఆర్‌ లీగ్‌ క్రికెట్‌ ట్రోఫీ ప్రారంభం
ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలి

శామీర్‌పేట, ఏప్రిల్‌ 16 : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, స్నేహపూర్వకంగా ఆటలు ఆడాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని యాడారం గ్రామంలో శుక్రవారం సీఎంఆర్‌ లీగ్‌ క్రికెట్‌ ట్రోఫీని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాను జయించాలంటే నిబంధనలు పాటించడమే ముఖ్యమన్నారు. కరోనాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మాస్కు ధరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఆటవిడుపుగా ఉండటానికి సీఎంఆర్‌ క్రికెట్‌ ట్రోఫీని ప్రారంభించామని చెప్పారు.
ఈ ట్రోఫీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.15 వేలు, ద్వితీయ బహుమతి రూ.10వేలు, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జహంగీర్‌పాషా, మూడుచింతల్‌పల్లి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీశ్‌గౌడ్‌, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మల్లికార్జున్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, జడ్పీటీసీ అనిత లాలయ్య, ఎంపీపీలు ఎల్లూబాయి బాబు, హారిక మురళీగౌడ్‌, శామీర్‌పేట సీఐ సంతోషం, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కంటం కృష్ణారెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు సరసం మోహన్‌రెడ్డి, సీహెచ్‌.విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement
క్రీడల్లో గెలుపోటములు సహజం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement