రేగోడ్, జూన్ 13: మండల కేంద్రంలోని ఉన్న త, ప్రాథమిక పాఠశాలల్లో గురువారం నిర్వహించిన బడిబాటలో జడ్పీ సీఈవో ఎల్లయ్య పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో బడీడు పిల్లల ను బడిలో చేర్పించాలని కోరారు. ఉన్నత, ప్రా థమిక పాఠశాలల హెచ్ఎంలు సుశీల, అంజిబాబు ఉపాధ్యాయులు ప్రతాప్, అశోక్, సంజీవులు, శివాని, శివకుమార్, నవీన్ కుమార్ ఉన్నారు.
వెల్దుర్తి, జూన్ 13. ప్రభుత్వ పాఠశాలల్లోనే నా ణ్యమైన విద్య లభిస్తుందని ఎంపీపీ స్వరూపా నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మానేపల్లి, యశ్వంతరావుపేట, మన్నెవారి జలాల్పూర్లో ఉన్న పాఠశాలలను ఎం ఈవో యాదగిరి, నాయకులతో కలిసి సందర్శించారు.
మానేపల్లిలో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. మన్నెవారి జలాల్పూర్లో వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారితో వైస్ ఎంపీపీ సుధాకర్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేశ్‌రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్‌గౌడ్, నాయకులు నరేందర్‌రెడ్డి, పోతిరెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీను, రామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చేగుంట, జూన్ 13: మండలంలో పాఠశాలల్లో ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులను మండల నోడల్ అధికారి నీరజ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా రెండు జతల యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులను ఉచింతంగా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వర్, మధుసూదన్‌చారి, చల్లా లక్ష్మణ్, వెంకటేశ్, చక్రధర్శర్మ, శారదారమ, శ్రీవాణి, భవాని, లత, రమాదేవి, రేఖా, సురేందర్, బాలరాజు, హరిరంజన్శర్మ, సుధాకర్, రేణుక, అరుణ, వీవో ప్రమీల తదితరులు పాల్గొన్నారు.