న్యాల్కల్, ఏప్రిల్ 1: ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో ఇంటింటికీ చేరుతున్నాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. శనివారం మండలంలోని ముంగి గ్రామ శివారులోని ఎల్ఎల్ఆర్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని పార్టీ శ్రేణులు భాజభజంత్రీలు, బ్యాండు బాజా హోరు మధ్య పటాకులు కాల్చుతూ తరలివచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావుకు గజమాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా చేయడానికి సీఎం కేసీఆర్ విజన్‌తో పనిచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభిస్తున్నారన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యనందిస్తున్నారని తెలిపారు. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ర్టానికి పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ర్టాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కావాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎనిమిదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశంలో అమలు చేసేందుకు బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి మరోసారి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలనను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేసి ప్రజలకు చైతన్యం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. బీఆర్ఎస్కి అండగా కార్యకర్తలు, ప్రజలు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షురాలు అంజమ్మ, గౌసోద్దీన్, పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవికుమార్, పార్టీ మండల నాయకులు పాండురంగారెడ్డి, నర్సింహారెడ్డి, భాస్కర్, సంగ్రాంపాటిల్, బస్వరాజ్‌పాటిల్, శ్రీకాంత్‌రెడ్డి, ఎంఆర్.ప్రవీణ్‌కుమార్, భూమారెడ్డి, పడకంటి వెంకట్, శివరాజ్, చంద్రశేఖర్‌రెడ్డి, రఫీయోద్ధీన్, సత్యనారాయణ, వీరారెడ్డి, ఇసాంపటేల్, నిరంజన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మక్సుద్, హనీఫ్, బక్కారెడ్డి, సర్పంచులు మారుతీయాదవ్, శివస్వామి, అనీల్, మల్లారెడ్డి, అమీర్, రవికుమార్, ఎంపీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధమ్మ, శివనంద శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలపై ఉన్నదని ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపూరం శివకుమార్ అన్నారు. 2014కు ముందు ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కుటుంబాలకు అందుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడమే అత్మీయ సమ్మేళనం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీని మరితం బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటికీ ప్రజలకు వివరించి ప్రతిపక్షాల నోరు మూయించాలి. నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాల్సి అవసరమున్నది. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కలిసి కట్టుగా పనిచేయాలి.