కోహీర్, సెప్టెంబర్ 17: హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నా రు. మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రుణమాఫీ కోసం ముందు రూ.40వేల కోట్లు అని చెప్పి, కేవ లం రూ.17.900 కోట్లతో రుణమాఫీ చేశారని మం డిపడ్డారు.
ఇంతవరకు రైతు భరోసా ఊసేలేదన్నారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ, రైతుబంధు ఇచ్చారని గుర్తుచేశారు. నిరద్యోగ భృతి, ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తరో జాబ్ క్యాలెండర్లో వివరించలేదని చెప్పా రు. మెగా డీఎస్సీ, ఉద్యోగులకు టీఏలు, డీఏలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఖమ్మంలో భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలను ఆదుకోలేదన్నారు. కార్లలో తిరుగుతూ హాయ్ అన్నారే తప్పిం చి కిందకు దిగలేదని మండిపడ్డారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ప్రజలు తిరగబడాలన్నారు.
సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా తెలంగాణకు ఎలాంటి సం బంధం లేని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చే యడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ గుండప్ప, పెంటారెడ్డి, మ చ్చేందర్, సంజీవరెడ్డి, బండి మోహన్, రాకేశ్, అశోక్‌రెడ్డి, మోహీయుద్దీన్, లవన్, ప్రవీణ్, హీరు రాథో డ్, చిన్నరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.