MLA Kotha Prabhakar Reddy | యువత క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
MLA Kotha Prabhakar Reddy | యువతలో ఉన్న అపార శక్తి, ప్రతిభ సరైన దిశలో వెలుగొందాలంటే క్రీడాస్ఫూర్తి అత్యంత కీలకమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
తొగుట : యువతలో ఉన్న అపార శక్తి, ప్రతిభ సరైన దిశలో వెలుగొందాలంటే క్రీడాస్ఫూర్తి అత్యంత కీలకమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ( MLA Kotha Prabhakar Reddy) అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్లో నిర్వహించిన కేపీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ( KPR Criket Tourney) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాకుండా జీవితాన్ని గెలిపించే మహత్తర పాఠశాలలని తెలిపారు.
గెలుపు ఓటములు సహజమని, క్రీడాస్ఫూర్తి ఉన్నవారే నిజమైన విజేతలని పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ధైర్యం, ఐక్యత, పట్టుదల వంటి విలువలు పెంపొందుతాయని , ఇవే భవిష్యత్ నాయకత్వానికి పునాది అవుతాయని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా యువతలోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడలు బలమైన ఆధారమని అన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, కొత్త కిషన్ రెడ్డి, పంజాల శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ రాజిరెడ్డి, నర్సింలు, మాజీ ఎంపీటీసీలు వేల్పుల స్వామి కొమ్ము శరత్, నాయకులు దోమల కొమురయ్య, మంగ నర్సింలు, సుతారి రమేష్, బోధనం కనకయ్య, బండారు స్వామి గౌడ్, అరుణ్ కుమార్, తగరం అశోక్, లక్ష్మారెడ్డి, ప్రశాంత్, నర్సింహారెడ్డి, సత్యం, యాదగిరి, లక్ష్మణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
అంతకుముందు జప్తిలింగారెడ్డిపల్లిలో జరుగుతున్న మహంకాళి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ్ రెడ్డి వేర్వేరుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
Chakali Ilamma | మెదక్లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

