శివ్వంపేట : పోక్సో కేసులో (POCSO case) శిక్ష పడుతుందనే భయంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నానికి ( Suicide attempt) పాల్పడ్డాడు. సోమవారం ఉదయం జరిగిన ఘటన వివరాలను గ్రామస్థులు వివరించారు.
శివ్వంపేట మండల పరిధిలోని శభాష్ పల్లి గ్రామానికి చెందిన పానగారి సుధాకర్ పై గతంలో పోక్సో కేసు నమోదైంది. త్వరలోనే తీర్పు వెలువడనుండడంతో తనకు శిక్ష పడుతుందనే భయంతో సోమవారం నర్సాపూర్ అడవి ప్రాంతంలో సెల్ఫీ వీడియో తీసి కుటుంబీకులకు పంపించాడు. వెంటనే కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సుధాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తన పిల్లలను తలుచుకుంటే ఏడుపొస్తుందని, చనిపోయే ముందు కూడా అంతా నిజమే చెబుతున్నానని సెల్ఫీలో పేర్కొన్నాడు. తనకు చనిపోవాలని లేదని, అందరికీ దూరమవుతున్నందుకు బాధగా ఉందని తెలిపారు.