కొండపాక, మే 29 : ఉద్యోగ సాధనలో యువత పోటీపడి చదువాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నా రు. ఆదివారం కొండపాక మండలం దుద్దెడలో ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెట్ మోడల్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులను ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుందన్నారు. యువత కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని సూచించారు. డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ అభ్యర్థులు ఉద్యోగం సాధించే వరకు పట్టుదలతో కష్టపడి చదవాలని సూచించారు. అనంతరం పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురికి నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మహదేవ్, ఎంపీటీసీ బాలాజీ, ఉపసర్పంచ్ ఆంజనేయులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్ర భాకర్, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య, కోశాధికారి చంద్రం, గౌరవ అధ్యక్షుడు భాస్కర్, కార్యదర్శులు నరసింహాచారి, యాదయ్య, నాగరాజు, ముఖ్యసలహాదారులు నాగభూషణం, సంతోష్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు.
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి..
గజ్వేల్, మే 29 : మహనీయులను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి సూచించారు. ఆదివారం పట్టణంలోని 11వ వార్డులో పిడిచెడ్ మార్గంలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులను గౌరవించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగానికి వెనుకాడని మహనీయుడు శివాజీ అని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గంగిశెట్టి చందనరవి, బాలమణి, శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, నాయకులు కిషన్‌రెడ్డి, దుర్గాప్రసాద్, కనకయ్య, యాదగిరి, యువకులు పాల్గొన్నారు.
శ్రీనివాస్‌కు ఎఫ్డీసీ చైర్మన్ పరామర్శ..
గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డుకు చెందిన శ్రీనివాస్‌కు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. శ్రీనివాస్‌కు కృత్రిమ కాలు అమర్చుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయాన్ని కొందరూ ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి ఆదివారం బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. కృత్రిమ కాలు అమర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కౌన్సిలర్ గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు కిషన్‌రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మయ్య, ఆర్కే శ్రీనివాస్, శ్రీను, ప్రభాకర్ ఉన్నారు.