సిద్దిపేట టౌన్, జూన్ 22 : గొప్ప చరిత్ర కలిగిన యాదవులకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడం దారుణమని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం యాదవుల ఆత్మగౌరవసభ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి కుల, కుటుంబ పాలన చేస్తున్నారని ఆరోపించారు.
కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా బీసీలకు ప్రధానంగా యాదవులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని మండిపడ్డారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యాదవులకు మంత్రి పదవి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక అవకాశాలు ఇచ్చి సముచిత గౌరవం కల్పించిందని గుర్తు చేశారు.యాదవులతో పాటు మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని, వారికి మంత్రి వర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 30న హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద జరిగే యాదవుల ఆత్మగౌరవ సభకు పార్టీలు, సంఘాలకతీతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కృష్ణయాదవ్ , ఐలయ్య, రా ము, నర్సింహులు, శ్రీనివాస్, మధు పాల్గొన్నారు.