సిద్దిపేట, డిసెంబర్ 11 : ఎవరి ఆసరా లేకుండా వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్న అభాగ్యులైన ఒంటరి మహిళలు, వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళలకు మనోధైర్యం కల్పించడమే లక్ష్యంగా మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో రూ.4కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. సోమవారం ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్లో జిల్లా కేంద్రం, పట్టణం, సెమి అర్బన్ ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఒంటరి మహిళలకు అండగా ఉండేలా వారి పిల్లలకు డే కేర్ సదుపాయంతో పాటు సాధ్యమైనంత వరకు ఉపాధి అవకాశాలు ఉన్నచోట వసతి లభ్యతను ప్రోత్సహిస్తారు. హాస్టల్లో కులం, మతం, వైవాహిక స్థితితో సంబంధం లేకుండా శ్రామిక మహిళలందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ పథ కం కింద సహాయం పొందే ప్రాజెక్టులు, వర్కింగ్ మహిళల కోసం ఉద్దేశించినవి. ఉద్యోగం కోసం శిక్షణ పొందే మహిళలు షరతులకు లోబడి హాస్టల్లో వసతిని పొందవచ్చు. వీరు 30 శాతం కంటే మించరాదు. హాస్టల్లో వర్కింగ్ మహిళలు లేకుం టే వీరికి వసతి కల్పిస్తారు. వర్కింగ్ మహిళలు పిల్లలు, బాలికలకు 18 సంవత్సరాలు వయస్సు వరకు, అబ్బాయిలకు 5 సంవత్సరాల వయస్సు వరకు వారి తల్లులతో హాస్టల్లో వసతి కల్పిస్తారు.
ఆయుష్‌తో ఆరోగ్యం
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సం ప్రదాయ వైద్యానికి రోజురోజుకూ ప్రాధాన్యత సంతరించుకుంటున్నది. ఆయుష్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైద్యం ప్రజలకు అందించాలనే ఉద్దేశంలో మంత్రి హరీశ్‌రావు చొరవతో పట్టణంలో రూ.15 కోట్లతో 50 పడకల ఆయుష్ దవాఖాన నిర్మించనున్నారు. దవాఖాన భవన నిర్మాణానికి సిద్దిపేట మెడికల్ కళాశాల ఆవరణంలో నేడు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
నాలుగు విభాగాలు ఒకే చోట
ఆయుష్ దవాఖానలోని నాలుగు విభాలను ఒకేచోట నిర్మించనున్నారు. ఆయుష్ దవాఖానలో ప్రతి విభాగం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఇందులో ఆయుర్వేదం, యో గా, హోమియో, నాచురోపతి, యూనాని, సిద్ధ విభాగాలు ప్రత్యేకంగా నిర్మించనున్నా రు. ఆయుర్వేదం, హోమియో, యూనాని యోగాపై మక్కవ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆయుర్వేద వైద్యంపై నమ్మ కం ఉన్న వారికి ఇక్కడ అన్ని వైద్య సేవలు ఆందించేలా ఏర్పాట్లు చేశారు. ఇది ప్రజలకు వరం మారిందని చెప్పవచ్చు. ఆయుష్ దవాఖాన ద్వారా భవిష్యత్‌లో మెడికల్ కాలేజీ దవాఖానలో చికిత్స చేయించుకుని ఫిజియోథెరపీ లాంటివి అవసరం ఉన్నవారికి ఇక్కడ వైద్య సేవలు అందించవచ్చు.
అనాథ పిల్లల రక్షణకు బాల రక్షా భవనాలు
సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 11: అనాథ పిల్లల రక్షణ, వారి హక్కుల కోసం ప్రభుత్వం కృషి చేస్తుం ది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాలో జిల్లాకు ఒకటి చొప్పున 33 బాల రక్షా భవనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్న పిల్లలను రక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక బాల రక్షక వాహనాన్ని సైతం అందించింది. బీఆర్బీ అనేది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్ ఆర్ఫాన్, సెమీ ఆర్ఫాన్, బెగ్గింగ్, వదిలివేయబడిన, మిస్సింగ్, చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ లేబర్, ఇల్లీగల్ అడాప్షన్, స్ట్రీట్ చిల్డ్రన్, అక్రమ రవాణా, నిరాధరణకు గురైన వారు.. మొదలగు 18 రకాలకు సంబంధించిన పిల్లలందరికీ బీఆర్బీ అనేది వన్ స్టాప్ సెంటర్ లాంటిది. బాల రక్షా భవన్‌కు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నేడు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ఏడు విభాగాలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్..
ప్రతి జిల్లాలో 7 విభాగాలు ఒకే చోట ఉండి పిల్లలకు సత్వర న్యాయం అందించడానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇం దులో ముఖ్యంగా దత్తత, పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్, ఉచిత న్యాయ సహాయం మొదలగు సేవలను అదించేందుకు ఉపయోగపడతాయి.
అతివలకు అండగా.. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భర్త లేని వారు, భర్త వదిలేసిన వారు పిల్లలతో ఒంటరిగా ఉన్న మహిళలకు భరోసాగా నిలుస్తున్నది. ఉపాధి చేస్తూ ఆర్థిక భారంతో ఎక్కడో ఉండే మహిళలకు ఉపయోగపడుతుంది. వారికి మరింత రక్షణ ఉండే విధంగా రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నిర్మిస్తున్నాం. త్వరతిగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తాం.
– ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు