బొల్లారం, డిసెంబర్ 20: ఓ పరిశ్రమలో కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్మికులు తెలిపినా వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ర్టానికి చెందిన శివ (23) పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో ల్యాబ్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం యాసిడ్ తాగి ఆత్మహత్యాయాత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన తోటి కార్మికులు యాజమాన్యంతో కలిసి కార్మికుడిని సమీపంలోని ఒక ప్రైవేటు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం కార్మికుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు జైపాల్‌రెడ్డి, ఆనంద్కృష్ణారెడ్డి కార్మికుడిని పరామర్శించారు. పని ఒత్తిడితోనే కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, కార్మికుడికి న్యాయం చేయాలని నాయకులు పరిశ్రమ ఎదుట కార్మికులతో ఆందోళన చేశారు. పరిశ్రమ వర్గాల వాదన మాత్రం ఈ ఘటనకు భిన్నంగా ఉందంటూ పలువురు వ్యాఖ్యానించుకోవడం గమనార్హం.