రామాయంపేట, అక్టోబర్ 4: మంత్రాలు చేస్తుందనే అనుమానంతో ఓ వృద్ధురాలి ఒంటిపై పెట్రో ల్ పోసి నిప్పంటించిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…కాట్రియాలకు చెందిన డ్యాగల ముత్త వ్వ(55) కొంతకాలంగా తమ కుటుంబ సభ్యులపై బాణామతి చేస్తుందని గ్రామానికి చెందిన పదిమంది వ్యక్తులు మూకుమ్మడిగా ఆమె ఇంటికి వెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం ఆమెను బయటకు తీసుకువచ్చి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి చేరకున్నారు. తీవ్రగాయాలైన ముత్తవ్వను 108 అంబులెన్సులో రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ పరిస్థ్ధితి విషమించి శుక్రవా రం మృతిచెందిం ది. తూప్రాన్ డీఎ స్పీ వెంకట్‌రెడ్డి కాట్రియాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తోటి మహిళపై దాడి జరుగుతుంటే మీరేం చేశారంటూ మృతురాలు ఇంటి పక్కనే ఉన్న స్థానికులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్కుమారెడ్డి రామాయంపేట మార్చురీలో వృద్ధురాలి మృతదేహాన్ని పరిశీలించి కాట్రియాలకు చేరుకున్నారు. నిందితులను చట్ట ప్రకా రం శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు జరిగితే సహించమని ఆయన హెచ్చరించారు. ఎస్పీ వెంట రామాయంపేట సీఐ వెంకట రాజగౌడ్, ఎస్సై బాలరాజు, సిబ్బంది తెలిపారు.
మెదక్ అర్బన్, అక్టోబర్ 4: ఆధునిక కాలంలో మంత్రాలు, మూఢ నమ్మకాలను నమ్మవద్దని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న తరుణంలో ఇలా మూఢ నమ్మకాలైన చేతబడి, బాణామతి, మం త్రాల నెపంతో ఒక మహిళను అత్యంత దారుణంగా కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడం చాలా దారుణమయైన విషయమని అన్నారు. ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉం దని, మూఢ నమ్మకాలపై మెదక్ జిల్లా పోలీస్ కళాబృందం ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు మూఢ నమ్మకాలను నమ్మవద్దని, దీనికి అసనమ్మకమే బలమై న కారణమని, ఆరోగ్య సమస్యలు అనేవి వారు నివసించే పరిసరాలు, వాతావరణ మా ర్పు, జన్యు సంబంధమైన కారణాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.