దుబ్బాక టౌన్/దుబ్బాక, నవంబర్ 2: త్వరలో మీ ముందుకు వస్తా.. మీరు ఎక్కడా, ఎవ్వరూ టెన్షన్ పడొద్దు.. భగవంతుడి దయతో ప్రాణాపాయం తప్పిందని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతూ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు గురువారం సాయంత్రం తన సందేశాన్ని పంపించారు.
భగవంతుడి దయ, ప్రజల ఆశీస్సులతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. మరో వారం రోజుల్లో మీ ముందుకు వస్తానని ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు తెలిపారు. నియోజకవర్గంలో తన గురించి ఎవ్వరూ టెన్షన్ పెట్టుకోవద్దని త్వరలోనే అందరి ముందుకు వస్తానని తెలిపారు.