అందోల్, మే 17 : రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని బలితీసుకున్నది. మృత్యువు భార్య, భర్తతో పాటు బాలుడు ప్రాణాలు హరించింది. శుక్రవారం మండలంలోని రం సాన్‌పల్లి శివారుల్లో చోటు చేసుకుంది. జోగిపేట ఎస్సై అరుణ్‌కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద తాడుగూర్ గ్రామానికి చెంది న శ్రీనివాస్ (35), భార్య సునీత (30), కుమారుడు నగేశ్ (7)లతో కలిసి బైక్‌పై స్వగ్రామం పెద్ద తాడుగూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు.
వారు ప్రయాణిస్తున్న బైక్ రంసాన్పల్లి శివారుకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన శ్రీనివాస్, సునీత ఘటనా స్థలంలోనే మృతి చెందగా, బాలుడు నగేశ్ జోగిపేట దవాఖానలో మృతి చెందా డు. కొన ఊపిరితో ఉన్న బాలుడి ప్రాణాలు కాపాడేందుకు సీఐ అనిల్‌కుమార్ ప్రత్యేక చొరవచూపి వైద్యులతో సీపీఆర్ చేయించిన ఫలితం లేకుండా పోయింది. బతుకుదెరువుకోసం వెళ్తూ ఇలా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో మృతుల బంధువులు దవాఖాన వద్ద బోరున విపించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.