మూడు గంటల కరెంట్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారో.. 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్కు ఓటేస్తారో ఆలోచించాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గిరిజన తండా, రామాయపల్లి, ఖాజాపూర్, కుమ్మరిపల్లి, శాలిపేట, చెన్నాయపల్లి, వెంకటరావుపల్లి, మడూర్ గ్రామాల్లో పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డప్పుచప్పుళ్లు, బోనాలు, మంగళహారతులతో బొట్టు పెట్టి పటాకులు కాలుస్తూ గ్రామగ్రామాన పద్మక్క ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రామాయపల్లిలో గొల్లకుర్మలు గొంగడి కప్పి, గొర్రె పిల్లను బహూకరించారు. ఖాజాపూర్ గిరిజన తండాలో గిరిజన మహిళలతో నృత్యం చేశారు.
చిన్నశంకరంపేట, నవంబర్ 3: రైతుబంధును అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఖాజాపూర్ గిరిజన తండా, రామాయపల్లి, ఖాజాపూర్, కుమ్మరిపల్లి, శాలిపేట, చెన్నాయపల్లి, వెంకటరావుపల్లి, మడూర్ గ్రామాల్లో పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. డప్పుచప్పుళ్ల, బోనాలు, మంగళహారతులు పట్టి, బొట్టుపెట్టి, పటాకులు కాలుస్తూ స్వాగతం పలికారు. రామాయపల్లిలో గొల్లకుర్మలు గొంగడి కప్పి, గొర్రె పిల్లను బహూకరించారు. ఖాజాపూర్ గిరిజన తండాలో గిరిజన మహిళలతో నృత్యం చేశారు. ప్రచారంలో భాగంగా మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబంధును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 60 ఏండ్లల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కరెంటు కష్టాలను కొనితెచ్చుకున్న వాళ్లమవుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీల నాయకులు చెప్పే మాయమాటలు విని మోసపోవద్దన్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హన్మంతరావు మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలకు 13 ఏండ్లు దూరముండి ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడిగితే ఎలా వేస్తారన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు. మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆడబిడ్డగా మరోసారి మీ ముందుకు వస్తున్నానని, భారీ మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏకే గంగాధర్‌రావు, జడ్పీటీసీ పట్లోరి మాధవి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రమణ, మండల ఇన్చార్జి రమేశ్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి బండారు స్వామి, వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, సర్పంచ్‌లఫోరం మండలాధ్యక్షుడు పూలపల్లి యాదగిరియాదవ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శివకుమార్, సర్పంచ్‌లు, జంకుబాయి, కుంట నాగలక్ష్మి, సాయం పోచ య్య, రాజమణిలక్ష్మీపతి, నర్సమ్మ, శ్రీనివాస్‌రెడ్డి, దయానంద్‌యాదవ్, రమేశ్, ఎంపీటీసీలు యాదగిరి, ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కుమార్‌గౌడ్, ఉపేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీను, సుధాకర్‌నాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.