వట్పల్లి/ పటాన్చెరు/ అమీన్పూర్, జూలై 9 : తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌పైన ఆపరమైన నమ్మకం ఉన్నదని, అందుకే బీఆర్ఎస్లోకి వలసలు పెరిగాయని, కండ్ల ఎదుట అభివృద్ధి కనిపిస్తుండడంతో ఇతర పార్టీల నాయకులు, కార్య కర్తలు గులాబీ కండువా కప్పుకుంటున్నారని అందోలు ఎమ్మె ల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఎమ్మెల్యే స్వగ్రామం పోతులబోగుడతోపాటు రాయికోడ్ మండలం మాటూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చంద్రయ్యతోపాటు 50 మంది కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఎమ్మె ల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని గ్రహించిన ప్రజలు సీఎం కేసీఆర్‌కు మద్దతుగా పార్టీలో చేరుతున్నారన్నారు. బీఆర్ఎస్లో చేరినవారికి అందరితోపాటు సమప్రాధాన్యత ఉంటుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్ మాజీ చైర్మన్ సిద్ధన్న పాటిల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బస్వరాజు పాటిల్, మండల కార్యదర్శి శంకర్, సర్పంచ్‌లు ప్రవీణ్, శంకర్, ఎంపీటీసీ పండరి, నాయకులు గాలిసాబ్, సిద్ధారెడ్డి, బాబుసాబ్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న కాంగ్రెస్ నాయకుల చేరికలు
అందోలులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మునిపల్లి మండలం చీలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాం గ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు తప్పా మరే పార్టీకి చోటులేదన్నారు. రాష్ట్రం లో మళ్లీ అధికారం మనదేనని, అందోల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ నమోదు చేసి, కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలన్నారు. కార్యక్రమంలో చీలపల్లి సర్పంచ్ వీరన్న, నాయకులు సాయికుమార్, జగన్మోహన్రెడ్డి, రాజు, విజయ్‌కుమార్, వీరేశం, విజయ్, మల్లేశం పాల్గొన్నారు.
పటాన్చెరు బీఆర్ఎస్కు కంచుకోట
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. పటాన్చెరులో రుద్రారం గ్రామానికి చెందిన నవ చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు మన్నె నవీన్ ఆధ్వర్యంలో యువకుల బృందం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో పటాన్చెరు ప్రాంతం అభివృద్ధికి కేంద్రంగా మా రిందన్నారు. యువతను ప్రోత్సహిస్తున్నానని, కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, సర్పంచ్ సుధీర్‌రెడ్డి, ఎంపీటీసీ మన్నెరాజు, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, బీఆర్ఎస్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, గూడెం మధుసూదన్‌రెడ్డి, అఫ్జల్ ఉన్నారు.
బీఆర్ఎస్లో చేరిన టైలర్స్ కాలనీ వాసులు
అమీన్పూర్ మున్సిపల్లోని 23వ వార్డు(టైలర్స్‌కాలనీ) కు చెందిన యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.