తొగుట: తెలంగాణ ఉద్యమ కారుడు ఘనపూర్‌కు చెందిన కొమ్ము కిషన్ ( Kommu Kishan) కు అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotha Prabhakar Reddy ) భరోసా ఇచ్చారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ లక్ష్మక్క పల్లిలోని ఆర్వీవీ ఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిషన్ ను ఎమ్మెల్యే పరామర్శించారు .
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యం గురించి చింతించ వద్దని సూచించారు. కిషన్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సీఈవో శ్రీనివాసును ఆదేశించారు ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, నాయకులు దోమల కొమురయ్య , భోదనం కనకయ్య , కొమ్ము శరత్, రాజిరెడ్డి బాలరాజు, రాజశేఖర్ తదితరులు న్నారు.