మెదక్ అర్బన్, జూన్ 18: మెదక్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు ఒకవర్గంపైనే చర్యలు తీసుకోవడం మంచిది కాదని, చట్టం ముందు అందరూ సమానులే నని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నా రు. బక్రీద్‌కు ముందురోజు మెదక్ పట్టణంలో జరిగిన ఘటనలో అరెస్ట్ అయి మెదక్ సబ్ జైలులో ఉన్న ఒకవర్గం వారిని బీజేపీ నాయకులు ములాఖత్ ద్వారా మంగళవారం కలిశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. మెదక్‌లో జరిగిన ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం 11గంటలకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసి అలర్ట్ చేసినా పోలీసులు సరిగ్గా స్పందించలేదన్నారు. అచేతనావస్థలో పోలీస్ శాఖ ఉండిపోయిందని విమర్శించారు. ఈ ఘటనలో పోలీసులు ఒకవర్గానికి కొమ్ము కాస్తే సహించేది లేదన్నారు. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్‌శాఖకు ఎంపీ సూచించారు. అనంతరం మెదక్ ఎస్పీని కలిసి జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేశారు.