నంగునూరు, మే 22: బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకూ పార్టీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందని, ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులకు ఈ ప్రమాద బీమా సదుపాయం అండగా నిలిస్తుందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతి కార్యకర్తలనూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు 48 మందికి రూ.2 లక్షల చొప్పున రూ.96 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే అధ్యక్షుడు కేసీఆర్ ఈ బీమా సదుపాయాన్ని కల్పించారన్నారు. బుధవారం నంగునూరు మండల కేంద్రానికి చెందిన సుంచనకోట యాదగిరి ఇటీవల ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. వారి కుటుంబానికి మంజూరైన రూ.2 లక్షల చెక్‌ను హరీశ్‌రావు యాదగిరి భార్య మాధవికి అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల సోమిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్‌గౌడ్, ఎంపీటీసీ సునీతామహేందర్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉల్లి మల్లయ్య, యువజన నాయకుడు ఆకుబత్తిని రా ము తదితరులు పాల్గొన్నారు.