సిద్దిపేట, ఆగస్టు 10 (నమస్తేతెలంగాణ ప్ర తినిధి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రధాన జలాశయాలు నిండుతున్నాయి. ఆరురోజులుగా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు లేఖతో ప్రభుత్వం దిగివచ్చి జలాశయాలను నింపుతున్నది. ఒక వైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు పడక తీవ్ర ఆందోళనలో ఉన్న రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
రాజకీయాలు పక్కనపెట్టి రైతులకు సాగునీటిని రాజరాజేశ్వర (మిడ్‌మానేరు) నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయకు సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లకు నీటిని పం పింగ్ చేయాలని కోరారు. కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం పక్షాన హరీశ్‌రావు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు గోదావరి జలాలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాడు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రా జెక్టులకు అడుగడుగునా అడ్డుంకులు సృ ష్టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది వస్తే అదే మాట్లాడారు. ఇవ్వాళ అదే ప్రాజెక్టుకు ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు హారతి పడుతున్నారు. మేడిగడ్డ మీద చిన్నపాటి లోపాన్ని భూతద్ధంలో చూపెట్టి రాజకీయం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తిట్టి పోశారు. సీఎం రేవంత్‌రెడ్డి, అతడి మంత్రివర్గ సహచరులు ఇష్టానుసారంగా మాట్లాడారు. మరీ ఇవ్వా ళ అదే కాళేశ్వరం ప్రాజెక్టును ముద్దాడుతున్నారు.
నీళ్లు రానే రావు ఎత్తిపోయడం కష్టం..ఇలా అనేక రకాలుగా మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు ఇవ్వాళ ఏం సమాధానం చెబుతారు..? కాళేశ్వరం ప్రాజెక్టులోని చివరి రిజర్వాయర్ అయిన కొండపోచమ్మకు గోదావరి జలాలు వచ్చా యి. ఇది ఎలా సాధ్యమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉంటే నీళ్లు వచ్చే వా….? ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటికి నీళ్లు తీసుకుపోవడానికి ప్రత్యేక పైప్‌లైన్ కోసం రూ.5,560 కోట్లకుపైగా ప్రభుత్వం కేటా యించింది.
జలాశయాల్లోకి జలాలు
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయం నుంచి రెండు పంపుల ద్వారా రోజుకు 6,400 క్యూసెక్కుల నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.22 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రస్తుతం అవుట్ ఫ్లో 6,600 క్యూసెక్కుల నీటిని రంగనాయకసాగర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. వచ్చిన నీటిని వెంట వెంటనే దిగువన ఉన్న రిజర్వాయర్లకు ఎత్తిపోస్తున్నారు. ప్రతి నీటి బొట్టును వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేసి అందుకు అనుగుణంగా నీటిని విడుదల చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్‌కు ఈనెల 5 నుంచి చం ద్లాపూర్లోని సర్జిపుల్ నుంచి రెండు పంపుల ద్వా రా నీటిని ఎత్తిపోస్తున్నారు. రిజర్వాయర్ సామ ర్థ్యం 3టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 2.05 టీఎంసీలుగా ఉన్నది. ఇన్‌ఫ్లో 6,600 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 5,200 క్యూసెక్కులు మల్లన్నసాగర్‌లోకి వస్తున్నాయి. ఈనెల 8 నుంచి మల్లన్నసాగర్‌లోకి తొగు ట మండలం తుక్కాపూర్ సర్జిపుల్ నుంచి 4 మోట ర్ల ద్వారా గోదావరి జిలాలను ఎత్తిపోస్తున్నారు. దీని సామర్థ్యం 50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామ ర్థ్యం 8.06 టీఎంసీలుగా ఉన్నది. ఇన్‌ఫ్లో 5,200 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 2,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు.
మల్లన్నసాగర్‌లోకి రోజుకు 0.45 టీఎంసీల చొప్పున నీటిని లిప్టింగ్ చేస్తున్నారు. మల్లన్నసాగర్‌ను మొదటి సారిగా 20 20లో ప్రారంభించారు. నాలుగేండ్లుగా ఇప్పటి వరకు మొత్తం 41.35 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చివరి రిజర్వాయర్ కొండపోచమ్మకు గోదావరి జలాలు చేరాయి. మర్కూక్ పంపు హౌస్ నుం చి రెండు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇన్‌ఫ్లో 2600 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 2500 క్యూసెక్కుల నీటిని కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. దీని సామర్థ్యం 15 టీ ఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 4.07 టీ ఎంసీలుగా ఉన్నది. సిద్దిపేట జిల్లాలోని అన్ని రిజర్వాయర్లకు గోదావరి జలాలు చేరుతుండడంతో జలకళను సంతరించుకుంటున్నాయి.