సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 28 : శాసన సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సంగా రెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ పోస్టర్ను ఎన్నికల అధికారి ఆవిష్కరించారు. అనంతరం బైక్ ర్యాలీని ప్రా రంభించారు. కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో కలెక్టర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం మరోసారి ఓటు నమోదుకు అవకాశం కల్పించిందని, ఈ నెల 31లోగా ఓటరుగా నమో దు చేసుకోవాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలని పేర్కొన్నారు. ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించేందుకు ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ అనే నినాదంతో బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధి కారి తెలిపారు. బైక్ ర్యాలీలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ అశోక్, డీఆర్వో నగేశ్, రిటర్నింగ్ అధికారి రవీందర్రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.