హుస్నాబాద్‌టౌన్, జూన్ 2: బీసీ సంక్షేమశాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తీరుతో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయజెండా, బీఆర్ఎస్ జెండాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.30లక్షలు ఇప్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారన్నారు. కలెక్టరేట్లో జరిగిన చర్చల్లో ఎకరాకు రూ.17లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇది రైతులకు అన్యాయం చేయడం తప్పా వేరేకాదన్నారు.
కాల్వల నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేశామని గొప్పలు చెబుతున్న మంత్రి ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు సేకరించారో, పరిహారం ఎందరికి ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ. 22లక్షల పరిహారం, ఇండ్లు, ఉద్యోగం ఇస్తున్నట్లుగానే గౌరవెల్లి రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి రిజ్వాయర్ స్థాయిని పెంచి, పంప్హౌజ్స్ను ప్రారంభించి, ట్రయల్న్‌న్రు సైతం నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కరువుప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం జరిగిందన్నారు.
మహాసముద్రంతోపాటు పలు చెరువులను సైతం పునరుద్ధరించే కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయన్నారు. శనిగరం ,సింగరాయ ప్రాజెక్టులను సైతం పునరుద్ధరించి సాగునీటిని అందించి వ్యవసాయాన్ని సాగులోకి తీసుకువచ్చామన్నారు. మాతాశిశుకేంద్రాన్ని ప్రారంభించలేదని, 150 పడకల దవాఖాన ఎక్కడికి పోయిందని, ఇంజినీరింగ్ కళాశాల సాంకేతిక శాఖ నుంచి కాకుండా యూనివర్సిటీ నుంచి మంజూరుచేసి ప్రజలకు దూరంగా ఉండే ప్రాంతంలో పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎల్కతుర్తిలో ట్రిపుల్ఐటీ సైతం ఏర్పాటుచేస్తామని చెప్పారని, ప్రజలకు మంత్రికి సరైన సంబంధాలు లేవనే విషయాన్ని గుర్తించాలన్నారు. నియోజకవర్గంలో తాము మంజూరు చేసిన నిధులతో చేపట్టే పనులు తప్పా కొత్తపనులు ఏవీ కనిపించడంలేదన్నారు.
మాజీ సర్పంచ్‌లకు బిల్లులు మంజూరుచేయాలని, కాంట్రాక్టర్ల బిల్లులు, ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మారపల్లి సుధీర్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వ ర్, మాజీప్రజాతినిధులు ఆకుల రజితా వెంకన్న, సుద్దాల చంద్రయ్య, భూక్యా మంగ, లక్ష్మి, మానస, రజినీ, తిరుపతిరెడ్డి, తిప్పారపు శ్రీకాంత్, వంగ రవీందర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి లక్ష్మణ్, కాసర్ల అశోక్‌బాబు, లింగాల సాయన్న, గద్దల రమేశ్, వంగవెంకట్రామిరెడ్డి, బండి రమణారెడ్డి, కొడముంజ రమేశ్, కన్నోజు రామకృష్ణ, గూళ్ల రాజు, మాలోతు బీలునాయక్, అయిలేని అనిత, వాల సుప్రజ, బిల్ల వెంకటరెడ్డి, కొంకట నళినిదేవి, యాటకార్ల స్వరూప, గొర్ల నాగయ్య, చంద శ్రీనివాస్ పాల్గొన్నారు.