అమీన్‌ఫూర్(జిన్నారం), జూలై 22: అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌ఫూర్ పరిధిలో రూ.16.53కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్‌తోనే అన్ని వర్గా ల సంక్షేమం సాధ్యమన్నారు. నిరుపేదలకు ఇండ్లు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం అదనపు నిధులు కేటాయిస్తామన్నారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలన్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్‌కు సొంత భవన నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీల్లో యూజీడీ, సీసీ రోడ్లు, తాగు నీటి కోసం పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించాలని ఆయన మంత్రికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్‌అమిత్, కాంగ్రెస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, అమీన్‌ఫూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కాంగ్రెస్ అమీన్పూర్ పట్టణ అధ్యక్షుడు శశిధర్, నాయకులు పు ష్ప, శశికళ, చంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, రవీందర్, ప్రతాప్‌రెడ్డి, మద్ది వీరారెడ్డి పాల్గొన్నారు.