మెదక్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికే పల్లె దవాఖాన లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మం గళవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో పల్లె దవాఖాన, మనఊరు- మనబడికి సంబంధించిన పనులపై ఇంజినీరింగ్ అధికారులు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రతి గ్రామంలో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. పల్లె దవాఖానల ఏర్పాటు పనుల ను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్ల ప్రమేయం లేకుండా, పల్లె దవాఖానల్లో ఎంబీబీఎస్ డాక్టర్లతోపాటు అర్హత కలిగిన వైద్య సిబ్బందితో సేవలు అందుతాయని తెలిపారు. ప్రజాప్రతినిధుల సహకారంతో పల్లె దవాఖాన ఏర్పాటు పను లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అల్లాదుర్గం, రంగంపేట, వెల్దుర్తిలోని పీహెచ్సీ మరమ్మతులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించడానికి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. మనఊరు-మనబడికి సంబంధించిన పనులు, పూర్తయిన పనుల వివరాలు సమర్పించాలన్నారు. పనులు ప్రారంభిం చకుంటే సంబంధిత అధికారులు మారింగ్ వేసి పనులు ప్రారంభించాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చందూనాయక్, పీఆర్ఈఈ సత్యనారాయణరెడ్డి, డీపీవో సాయిబాబా, డీఈవో రాధాకిషన్, ఇంజినీర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.