కాలుష్య కారక పరిశ్రమలపై
సంగారెడ్డి జిల్లా దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యమయంగా మారడంతో స్థానికులు,రైతులు, కాలుష్య వ్యతిరేక పోరాట సమితి సభ్యులు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం హైదరాబాద్ సనత్‌నగర్‌లోని కాలుష్యనియంత్రణ మండలి రాష్ట్ర కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు.
- పీసీబీ అధికారులను సస్పెండ్ చేయాలి
- పీసీబీ రాష్ట్ర కార్యాలయం ఎదుట దోమడుగు గ్రామస్తుల మహాధర్నా
గుమ్మడిదల,డిసెంబర్12: సంగారెడ్డి జిల్లా దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యమయంగా మారడంతో స్థానికులు,రైతులు, కాలుష్య వ్యతిరేక పోరాట సమితి సభ్యులు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం హైదరాబాద్ సనత్‌నగర్‌లోని కాలుష్యనియంత్రణ మండలి రాష్ట్ర కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమైన కాలు ష్య నియంత్రణ మండలి అధికారులను, ఇతర ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాలుష్య సమస్యపై నాలుగు నెలల నుంచి తహసీల్దార్ నుం చి కలెక్టర్ వరకూ అధికారులందరినీ కలిసి వివరించామన్నారు. సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లామన్నారు.
అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో గ్రామంలో ర్యాలీలు చేశామని, సంగారెడ్డి కలెక్టరేట్ ఎదు ట ధర్నా సైతం నిర్వహించినట్లు గ్రామస్తులు గుర్తుచేశారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో శుక్రవారం పీసీబీ రాష్ట్ర కార్యాలయం ఎదుటే భోజనాలు చేసి, నల్లకుంట చెరువు కలుషిత జలాలను గుమ్మరించి నిరసన తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పీసీబీ అధికారులు గేటువద్దకు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాసంఘాల నాయకులతో కలిసి వివరంగా చర్చించారు. త్వరలో ఈ సమస్యపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొసాగిస్తామని గ్రామస్తులు, ప్రజాసంఘాలు తేల్చిచెప్పారు. దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యానికి కారణమైన పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కాలుష్య వ్యతిరేకపోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ యాక్షన్ కమిటీ, రైతులు పీసీబీ రాష్ట్ర కార్యాలయం ఎదుట శుక్రవారం మహాధర్నా చేపట్టగా, ఇదే సమయంలో గ్రామానికి చెందిన కొందరు నాయకులు గుమ్మడిదల తహసీల్దార్‌ను కలవడంపై కేవీపీసీ నాయకులు,ప్రజాసంఘాల నాయకులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలిసిన ఆందోళనకారులు హుటాహుటిన గుమ్మడిదల తహసీల్ కార్యాలయం వద్దకు చేరుకుని మహాధర్నా చేపట్టారు. కాలుష్యంపై తాము ఆందోళనలు చేస్తుంటే, కొంతమంది నాయకులు తహసీల్దార్‌తో మంతనాలు జరపడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేవీపీసీ కన్వీనర్లు మెంగని మంగయ్య, మద్దిబాల్రెడ్డి,జయమ్మ, కమిటీ సభ్యులు జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, స్వేచ్చారెడ్డి, టీపీజీఏసీ నాయకులు అశోక్‌కుమార్, సైనిటిస్ట్ కన్నెగంటి రవి, బీసీ డెమోట్రిక్ జేఏసీ నాకులు జనార్దన్, మానవహక్కుల వేదిక నాయకులు పి.సం జీవ్, సంధ్య, ైక్లెమేట్ ఫ్రంట్ నాయకులు రఘునందన్, పర్యావరణ ప్రజాఉద్యమాల నాయకులు రాజశేఖర్, వినోద్‌కుమార్, లక్ష్మి, మానస, చంద్రారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

