జహీరాబాద్, అక్టోబర్ 8: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్‌పూర్ గ్రామ శివారులో కర్ణాటక బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు ఆందోళన చేపట్టారు. గ్రామ సమీపం గుండా వెళ్లే జహీరాబాద్-బీదర్ ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించే కర్ణాటక డిపో బస్సును అడ్టుకున్నారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు.
జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు, హద్నూర్ ఎస్ఐ రామానాయుడు హుటాహుటినా సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రమాదానికి కారణమైన కర్ణాటక డిపోకు చెం దిన అధికారులు, సిబ్బంది వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదం టూ ఆందోళనకారులు భీష్మించుకుని కూర్చున్నారు. కర్ణాటక డిపో ఆధికారులతో జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు మాట్లాడారు. జహీరాబాద్, బీదర్ ఆర్టీసీ అధికారులను హద్నూర్ పోలీస్‌స్టేషన్‌కు రప్పించి గ్రామస్తులు, మృతుల కుటుంబాల సమక్షంలో మా ట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, ఆందోళనలతో కర్ణాటక డిపో బస్సులను దారిమళ్లించారు.
జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీపాటిల్, టీఎస్ఐఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్, జహీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శివాజీపాటిల్, చంద్రప్ప, ఓంకర్, మల్లప్ప, గౌసోద్దీన్, శివశరణప్ప, వెంకట్‌రెడ్డి తదితరులు మృతుల కుటుంబసభ్యులను పరామర్శించా రు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. తాత, అమ్మానాన్న, తమ్ముడు మృతి చెందడందో అనాథలుగా మిగిలిన ముగ్గురు అక్కాచెల్ల్లెళ్లను పట్టుకుని బంధువులు విలపించారు. బీదర్-జహీరాబాద్ ప్రధాన రోడ్డు మార్గం ప్రమాదాలకు నిలయంగా మారిందని ఆయా గ్రామాల ప్రజ లు ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు మంజూరై ఏండ్లు గడుస్తున్నా ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రమాదకరంగా మారిన గుంతలను వెంటనే పూడ్చాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.