Village Roads | రామాయంపేట రూరల్, మార్చి16 : రామాయంపేట మండలంలో పలు గ్రామాలకు వెళ్లే రోడ్ల పరిస్థితి ఎంతో అద్వానంగా మారింది. చాలా గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్లు, గిరిజన తండాలకు వెళ్లే మట్టి రోడ్లు గుంతలమయంగా మారాయి. దీంతో వాహనదారులతోపాటు గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు పడ్డ రోడ్లలో కనీసం మట్టిని కూడా పోయడం లేదు. ఈ విషయంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల పరిధిలోని లక్ష్మాపూర్ నుండి కాట్రియాల,పర్వతాపూర్, దంతేపల్లి గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్లతో పాటు అటువైపున ఉన్న గిరిజన తండాలు, మోత్కుల తండా, లాక్యాతండా, తీన్నెంబర్ తండా, సుభాష్ తండా, రాంచందర్ నాయక్ తండా, కాట్రియాల తండాలకు వెళ్లే మట్టి రోడ్లు కూడా గుంతల మయంగా మారాయి. దీంతో పగలే ప్రయాణం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి రాత్రి వేళల్లో వారి బాధలు వర్ణణాతీతం. ఈ మార్గాల నుండి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన చాలా మంది వాహనదారులు ప్రయాణిస్తుంటారు.
ఏదైనా ప్రమాదం జరిగి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే రోడ్డు గురించి తెలిసి అటువైపు రాలేని దుస్థితి నెలకొంది. ఆటోలు నడిపే వారు ఈ రోడ్డులో నడపడం వల్ల రెండు రోజులకోసారి రిపేరులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మధ్యలో, రోడ్లు అంచున గుంతలు పడటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, తమ గ్రామాలకు సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలకు వస్తున్న అధికార పార్టీల నాయకులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా బాధను పట్టించుకునే నాధుడే కరువయ్యారు : నక్కిర్తి సాయిలు, దంతేపల్లి.
మాది మారుమూల గ్రామం దంతేపల్లి.ఇతర గ్రామాలకు వెళ్లి మా గ్రామానికి లక్ష్మాపూర్ మీదుగా రావడానికి రోడ్డు గుంతలుగా మారడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం.సుమారు ఒకటి కాదు రెండు కాదు లక్ష్మాపూర్ నుండి దంతేపల్లి చేరే వరకు 20 నుండి 30 వరకు రోడ్డుమీదు,పక్కన గుంతలు, కొన్ని ప్రమాదకర మూల మలుపులు ఉన్నాయి. రోజు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో కల్పించుకొని సమస్య పరిష్కరించాలి.
తండాలను చిన్న చూపు చూస్తుండ్రు : గోపాల్, తీన్ నెంబర్ తండా
మా తండాకు ఇప్పటి వరకు బీటీ, సీసీ రోడ్డు లేదు.ఉన్న మట్టి రోడ్డు కూడా గతంలో మంచిగా ఉండేది. మీ మద్య కాలంలో ఈ మట్టి రోడ్డు కూడా గుంతలుగా తయారైంది. వ్యవసాయ ప్రాతం ఎక్కువ ఉండటంతో వాహనాలు ఎక్కువ నడుస్తాయి. ఈ విషయం ప్రజాప్రతినిధులతో పాటు అధికారులకు కూడా తెలుసు. కానీ ఈ రోడ్డు గురించి పట్టించుకొని శాశ్వత పరిష్కారం చూపడానికి ముందుకు రావడం లేదు. గతంలో కనీసం మట్టి రోడ్డు అయినా మంచిగా ఉండేది. ఈ రోడ్డును బాగు చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు పట్టించుకోవడం లేదు.
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు