సిద్దిపేట, సెప్టెంబర్ 5 : వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సహాయార్థం సరుకులు తీసుకెళ్తున్న వాహనాలకు జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు తీవ్రం నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తూ, ముందుగా మేలుకుంటే ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదన్నారు.
బీఆర్ఎస్ నాయకులతో కలిసి మేము వరద బాధితులకు సహాయం చేసేందుకు ముంపు ప్రాంతంలో పర్యటిస్తే మాపైన కాంగ్రెస్ కార్యకర్తలతో దాడి చేయించడంచోపాటు ఉల్టా కేసులు పెట్టించారన్నారు. కేసులకు భయపడేది లేదని హరీశ్‌రావు హెచ్చరించారు. మానవ సేవే మాధవ సేవని అందరూ ముందుకొచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం గానీ, కాంగ్రెస్ నాయకులు గానీ బాధితులకు కనీసం అన్నం, మంచినీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. మాపైన దాడి చేయడానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలపై అక్కడి ప్రజలు తిరగబాడ్డారన్నారు.
అయిన మేము భయపడకుండా బాధిత కుటంబాలకు మావంతు సహాయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒకనెల వేత నం విరాళంగా ఇస్తున్నామని చెప్పారు. మా తరహాలో మిగతా పార్టీల నాయకులు ముందుకొచ్చి సహాయం చేయాలన్నారు. ఇండ్లు మునిగిపోయిన వారికి రూ.2 లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. సిద్దిపేట నుంచి ఉడుతభక్తిగా సహాయం పంపిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేటలోని వ్యాపారులు, డాక్టర్లు, నాయకులు, కౌన్సిలర్లు విరాళాలు అందించారని మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఖమ్మం జిల్లాకు 200 క్వింటాళ్ల సన్న బియా న్ని అందించనున్నట్లు తెలిపారు.
వరద బాధితులకు సహాయం అందించాలని మాజీమంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పిలుపుమేరకు పట్టణంలోని అనేకమంది వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకొచ్చి సహాయం అందించారు. సహాయం అందించిన వారిలో అమర్నాథ్, కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి, సిద్దిపేట ధార్మిక సేవా సమితి 500 గ్రాసరీ కిట్లను, విమార్ట్ 500 కిలోల చింతపండు,
సిద్దిపేట కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ 400 మెడికల్ కిట్లు, సిటిజన్ క్లబ్ రూ.లక్ష, వైన్స్ అసోసియేషన్రూ.లక్ష, ఐఎంఏ రూ.లక్ష, ఎన్జీవోస్ భవన్ రూ.50,000, ఉప్పల శ్రీనివాస్ రూ.30,000, కూర శ్రీనివాస్ రూ.25వేలు, రాజస్థాన్ వ్యాపారులు రూ.21000, భూసాని శ్రీను ఫౌల్ట్రిఫారమ్ రూ.21 వేలు, కృష్ణ బాల్దావా రూ.21వేలు, ఇల్లందుల అంజ య్య రూ.11వేలు, అన్నపూర్ణ హార్డ్‌వేర్ రూ.11 వేలు, మున్సిపల్ కమిషనర్ రూ. 11వేలు, అకుల శ్రీనివాస్ రూ.11వేలు, మేడిశెట్టి భాస్కర్ రూ.5వేలు, జగదాంబ పార్బాయిల్డ్ రూ. 5 వేలు, తమ్మిశెట్టి వీరే శం రూ.5వే లు, త్రిబుల్ ఎక్స్ నాగరాజు 500 సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు, ప్రశాంత్ కిరాణం 500 బిస్కెట్ ప్యా కెట్లు, కోర్తివాడ లక్ష్మణ్ 500 దుప్పట్లు, సుబ్రమణ్య దాల్మిల్ 150కిలోల పల్లీలు, రామోజీరావు క్వింటాల్ బియ్యం, చీరెలు,
స్టీల్ పాత్రలు, అయిత రత్నకర్ 500 టీ ప్యాకెట్లు, జూలూరి సంతోష్ 2 క్వింటాళ్ల బియ్యం, గంజి రాములు 500 కిలోల ఆలుగడ్డ, గోల్డెన్ బేకరీ 2వేల బ్రెడ్ ప్యాకెట్లు, ఇర్షాద్ హుస్సేన్ 350కిలోల బియ్యం, బ్రెడ్, బిస్కెట్లు, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ మార్కెట్ ఎక్స్ రోడ్డు(నరేశ్) బట్టలు, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ (వెంకన్న)బట్టలు, స్వయంవరం సిల్క్స్ బట్టలను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, దాతలు పాల్గొన్నారు.
వరద బాధితులకు సిద్దిపేట వీడియో జర్నలిస్టులు తమవంతు సహాయంగా రూ.10వేలను గురువారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా వీడియో జర్నలిస్టులను ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందించారు. మనవతాదృక్పథంలో ముందురావడం సంతోషకరం అన్నారు. కార్యక్రమంలో ఎల్లోహర్, గిరి, వెంకట్, నవీన్, చందు, అంజి, నరేశ్, రమేశ్, ప్రవీణ్, కృష్ణ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.