మెదక్‌లో ఎగిరేది గులాబీ జెండానే..
మెదక్ ఎంపీ స్థానంలో మరోసారి గులాబీ జెండానే ఎగురుద్దని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అనంతసాగర్, సైదాపూర్, అలీయాబాద్, తొగర్పల్లి గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
- గద్దెనెక్కి హామీలు విస్మరించిన కాంగ్రెస్
- ఎన్నికల ప్రచారంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
కొండాపూర్, ఏప్రిల్ 30: మెదక్ ఎంపీ స్థానంలో మరోసారి గులాబీ జెండానే ఎగురుద్దని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అనంతసాగర్, సైదాపూర్, అలీయాబాద్, తొగర్పల్లి గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అమలుకాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పథకాలను పక్కనబెట్టి గాలి మాటలతో పబ్బం గడుపుతున్నారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రణమాఫీ, రూ.15 వేల రైతుబంధు, కల్యాణ లక్ష్మీలో తులం బంగారం వంటి పథకాల అమలు ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మాజీ సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యకర్తలు గ్రామాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను వివరిస్తూ బీఆర్ఎస్కు ఓటు వేసేలా ప్రచారం ముమ్మ రం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ గెలు పే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. గెలిచిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు అని చెప్పి మోసం చేసిన రేవంత్‌రెడ్డికి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకపోతే దిగిపోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మావతీపాండురంగం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు మల్లేశం, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు రుక్మొద్దీన్, నాయకులు మల్లాగౌడ్, గోవర్ధన్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, నగేశ్, రామాగౌడ్, నర్సింహులు, జడ్పీ కోఆప్షన్ అమీనొద్దీన్, జగదీశ్వర్, ఫయిం, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

