ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ మోసం చేసిందని, గురువారం నుంచి జరగనున్న గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలని పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు.
గజ్వేల్, ఏప్రిల్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ మోసం చేసిందని, గురువారం నుంచి జరగనున్న గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలని పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈసందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా దాటవేస్తున్నదని, గ్రామసభలకు ఎమ్మెల్యేలు, మంత్రులను వెళ్లనీయకుండా అధికారులతోనే సభలు నడపేందుకు నిర్ణ యం తీసుకుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే భావన వారిలోనే వచ్చిందన్నారు.
అధికారంలోకి వస్తే అనేక హామీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి నేడు ప్రజల ముందుకు వెళ్లే దమ్ములేక ముఖం చాటేశారన్నారు. 24గంటల కరెంట్ ఇవ్వకుండా రైతులను మోసం చేసిందన్నారు. రైతులకు పంట రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఆటో డ్రైవర్లకు రూ.12వేలు, నిరుద్యోగులకు రూ.4వేలు, పింఛన్ రూ.4వేలు, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. దళిత కుటుంబాలకు రూ.12వేలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారిశుధ్యం పడకేసిందని,గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

