గజ్వేల్, జూలై 8: తెలంగాణ ద్రోహులు బీజేపీ, కాంగ్రెస్ నాయకులేనని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్‌రావు పేదల భూములు కబ్జా చేసి తమ కుటుంబ సభ్యుల పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతోనే పట్టాగా మార్చుకున్నాడని ఆరోపించారు.
భూ కబ్జా చేశారని మెదక్ ఎంపీపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఆయన ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారన్నారు. భూ కబ్జా చేయలేదని ఖండించక పోవడంతో నిజంగానే కబ్జా చేసినట్లు ప్రజలకు అర్థమవుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా ఎంపీపై సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి విచారణకు ఆదేశించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంతో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని తేటతెల్లమవుతుందన్నారు.
మెదక్ ఎంపీగా గెలిచి రాష్ట్ర అభివృద్ధికి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో రఘునందన్‌రావు విఫలమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు రా ష్ట్రంలో చేస్తున్న అరాచకాలపై బీజేపీ ఎంపీలు ప్రశ్నించకుండా వారికి వంత పాడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకు లు మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. పసలేని విమర్శలకు రానున్న స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, కౌన్సిలర్ గుంటుకు రాజు, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, కో ఆప్షన్ సభ్యుడు కుమార్, నాయకులు శ్రీనివాస్, స్వామి, చారి పాల్గొన్నారు.