గజ్వేల్, నవంబర్ 7: కాంగ్రెస్ ప్రభు త్వ అసమర్ధ విధానాలతో ఆదాయం తగ్గిపోయిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీజినల్ రింగ్‌రోడ్డు పనులు అటకెక్కాయని, ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైందని, వ్యాపారవేత్తలు ఆం దోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
రూ.2లక్షల పంట రుణమాఫీ పూర్తిగా చేయలేదని, రైతులకు రైతుబంధు ఇవ్వకుండా నోట్లో మట్టి కొట్టిందని విమర్శించారు ఆరుగ్యారెంటీలు, అనేక హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేడం లేదన్నారు. అన్నివర్గాలను మోసం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని విమర్శించారు. రోజుకో డ్రామా, రోజుకో డైవర్షన్ టాఫిక్‌తో రాష్ట్రంలో ముఖ్యమం త్రి, మంత్రులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. పాలన గాడి తప్పిందని, వ్యా పారులు, రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం రూ.90 వేల కోట్ల అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు.
ఎటుచూసినా ధర్నాలు, రాస్తారోకో లు చేస్తున్నారని, ప్రభుత్వం ఎవరిని పట్టించుకోవడం లేదన్నారు. గురుకులాలు సమస్యలతో సతమవుతున్నాయని తెలిపారు. కలుషిత ఆహారంతో విద్యార్థులు దవాఖానల్లో చేరుతున్నరని, విద్యార్థుల సం క్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. గజ్వే ల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు వసూళ్లుకు పాల్పడుతున్నారని, పరిశ్రమల యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ మంజూరు చేసిన రూ.170కోట్ల నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.