కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో అభివృద్ధి ఆగిందని, ప్రతి కుటుంబానికి నష్టం జరిగిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు.
- బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, జూన్ 15: కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో అభివృద్ధి ఆగిందని, ప్రతి కుటుంబానికి నష్టం జరిగిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని మక్తమాసాన్‌పల్లికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ల కార్యకర్తలు పలువురు సోమవారం ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో వంటేరు ప్రతాప్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి యువకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని, రాబోయే రోజుల్లో కేసీఆర్ సారథ్యంలో మళ్లీ తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ఆశాభాం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
యూరియా యాప్ తొలిగించాలని, రైతులకు ఎరువులు, విత్తనాలు అందించడంలో సర్కారు విఫలమైందన్నారు. పంటల కొనుగోలులో ప్రభుత్వం విఫలంతో కావడంతో రైతులు ఇబ్బందులు పడినట్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మల్లేశం, గ్రామ సర్పంచ్ ఫహీమ్, మండల ప్రధాన కార్యదర్శి పాల రమేశ్‌గౌడ్, అహ్మద్, ఉప సర్పంచ్ రాకల వెంకటేశ్, మాజీ సర్పంచ్ శాతం రజిత వెంకటేశ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు శాతం శ్రీకాంత్, పార్టీలో చేరిన వారిలో రాజు, శాతం గణేశ్, మహేశ్, వేణు, రవీందర్, వెంకటేశ్, ప్రశాంత్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

