కొండపాక(కుకునూరుపల్లి), అక్టోబర్ 23: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలకు అండగా ఉంటున్నారని ఆ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నా రు. బుధవారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని మేదినిపూర్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కిష్టాపు రం నరసయ్య కుటుంబానికి బీఆర్ఎస్ ప్రమాద బీమాకు సంబంధించి రూ.2లక్షల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యకర్తలకు అండగా ఉండాలనే లక్ష్యంతో రూ.2లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించారన్నారు.
బీఆర్ఎస్ సభ్య త్వం తీసుకొని ప్రమాదంతో మృతి చెందిన కార్యకర్తలకు గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.7కోట్ల 26 లక్ష లు అందజేసినట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో 97వేల మంది బీఆర్ఎస్ సభ్య త్వం కలిగి ఉన్నారన్నారు. ప్రస్తుతం కాం గ్రెస్ డైవర్షన్ రాజకీయాలతో లబ్ధి పొందుతున్నందన్నారు. ఇప్పటివరకు రైతులకు పూర్తిగా రూ.2లక్షల పంటరుణమాఫీ కాలేద ని మండిపడ్డారు. ఢిల్లీకి పెద్దఎత్తున డబ్బుల మూటలు పంపించడానికి లక్షా 50కోట్లతో మూసీనది సుందరీకరణకు తెరలేపినట్లు ఆరోపించారు.
మూసీనది ప్రాజెక్టుతో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఇందుకోసం తెలంగాణ భవన్లో లీగల్ సెల్ ఏర్పా టు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకు లు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఉత్తరకొరియాకు విహార యాత్ర కోసం వెళ్లారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దేవీ రవీందర్, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ అమరేందర్, కోల సద్గుణారవీందర్, లక్ష్మణ్, రాజు, దశరథం, నాగరాజు, లగిశెట్టి కనకయ్య, అహ్మద్, సాగర్, సంపత్, లింగం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.