గజ్వేల్, మార్చి 20: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టిస్తున్నా చివరకు న్యాయం గెలుస్తుందని, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే చివరకు న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లో హరీశ్‌రావును ఆయన నివాసంలో వంటేరు ప్రతాప్‌రెడ్డి కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి వారసులు పంజాగుట్ట పీఎస్‌లో హరీశ్‌రావుపై పెట్టిన అక్రమ కేసును హైకోర్టు కొట్టివేయడం సంతోషంగా ఉందన్నారు.
నిరాధారమైన ఆరోపణలు చేసి కక్షపూరితంగా కేసులు పెట్టించి ప్రజల్లో పలుకుబడిని తగ్గించే ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి చెంపచెల్లు మనేలా కోర్టు తీర్పు వచ్చిందని తెలిపారు. కక్షసాధింపులు మానుకుని హామీలు అమలు చేసి ప్రజల మన్ననలు పొందాలని ప్రభుత్వాని ఆయన హితవు పలికారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఆపమని పేర్కొన్నారు. ప్రతిక్షణం ప్రజల్లో ఉండి, ప్రజల మేలుకోసం తపించే నాయకుడు హరీశ్‌రావును బెదిరింపులకు గురిచేయాలని చూడడం మానుకొని ప్రజాపాలనపై దృష్టిపెట్టాలన్నారు.
దుబ్బాక, మార్చి 20: ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపుతో అక్రమ కేసులు బనాయించి వేధించాలనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు గుణపాఠం అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుపై కక్షపూరితంగా రేవంత్ సర్కారు పెట్టిన ఫోన్ ట్యాపింగ్ అక్రమ కేసు హైకోర్టు విచా రణలో ఆధారాలు లేక కొట్టివేసినందుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గురువారం హరీశ్‌రావును ఆయన కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.