మనోహరాబాద్/తూప్రాన్, ఏప్రిల్ 6: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కూచారంలో నిర్వహించిన స్వామి వారి కల్యాణోత్సవంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అలాగే తూప్రాన్ మున్సిపల్ పరిధి పోతరాజ్పల్లిలో మాజీ ఎంపీటీసీ ఐలేష్ యాదవ్ నివాసంలో నిర్వహించిన మల్లన్న కల్యాణోత్సవంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్‌రెడ్డి దంపతులు, మాజీ చైర్పర్సన్ జ్యోతి, కౌన్సిలర్లతో పాటు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.