గజ్వేల్, అక్టోబర్ 2: ప్రజాక్షేత్రంలో మాట్లాడేటప్పు డు ఆలోచించి మాట్లాడాలని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై ఎలా పడితే అలా మాట్లాడితే మైనంపల్లి నోటికి తాళం వేస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్‌లో మైనంపల్లి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించా రు. మైనంపల్లికి ఆ ముగ్గురు అంటే వెన్నులో వణు కు పుడుతుందన్నారు.
నీకు దమ్మూధైర్యం ఉంటే గజ్వేల్, సిద్దిపేటలో చేసిన అభివృద్ధిని మెదక్‌లో చేసి చూపెట్టాలని, ఇప్పుడు ఉన్నది నీ ప్రభుత్వమే కదా అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.170కోట్లు మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలు ఇస్తే వాటిని రద్దు చేసి సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తరలించారన్నారు. దమ్ముంటే ఆ నిధులను వెనక్కి తెచ్చి గజ్వేల్ అభివృద్ధికి కేటాయించాలన్నా రు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ముంపు బాధితులపై మైనంపల్లి మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ప్రాజెక్టులు నిర్మించి కాల్వల ద్వారా ఇతర జిల్లాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులకు చాలావరకు పరిహారం చెల్లించారని, మల్లన్న, కొం డపోచమ్మసాగర్ నిర్వాసితులకు దాదాపు రూ.440 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఇతరత్రా కారణాలతో మిగిలిన రెండు శాతం మందికి పరిహారాన్ని అందించలేకపోయామన్నారు. అబద్ధపు, అసత్యపు హామీలతో గద్దెనెక్కి 10 నెలలు గడుస్తున్నా రేవంత్ సర్కార్ ఆర్అండ్ఆర్ కాలనీకి రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. మైనంపల్లి హన్మంతరా వు అబద్ధాలు మాట్లాడుతున్న తీరు చూస్తే దయ్యా లు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. సమావేశం లో వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్లు మెట్టయ్య, అత్తెల్లి శ్రీనివాస్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.