స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంటలో సర్పంచ్ బుర్ర సురేశ్గౌడ్తో కలిసి గ్రామస్తులకు జాతీయజెండాలను అందజేశారు. ప్రతి ఇంటిపై జాతీయజెండాలను ఎగురవేయాలని, వజ్రోత్సవాలను ఉత్సాహంగా నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట జడ్పీసీఈవో శైలేశ్, ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ జ్యోతి ఉన్నారు.
ఈ నెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రం మెదక్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. డీఈవో ఆదేశాలతో 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు సినీమాక్స్ థియెటర్లో గాంధీ చలనచిత్రాన్ని వీక్షించారు.
మెదక్ మండలంలోని మంబోజిపల్లి, రాజ్‌పల్లి, బాలానగర్, మాల్కాపూర్, పాతూరు గ్రామాల్లో సర్పంచ్‌లు ,ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి జాతీయ పతకాలను అందజేశారు. అల్లాదుర్గం మండలంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ జాతీయ జెండాలను అందజేశారు. రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని రాయిలాపూర్, కాట్రియాల, దామరచెరువు, డీ.ధర్మారం, అక్కన్నపేట, ఝాన్సీలింగాపూర్ గ్రామాల్లో జాతీయ జెండాను పంపిణీ చేశారు. మున్సిపాలిటీలో చైర్మన్ జితేందర్‌గౌడ్, కమిషనర్ ఉమాదేవి, కౌన్సిలర్లు ఇంటింటికీ వెళ్లారు.
నిజాంపేట, శివ్వంపేట, వెల్దుర్తి, కొల్చారం, చిలిపిచెడ్ మండలాల్లో ఇంటింటికీ జాతీయజెండాను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురాలని చేగుంట, నార్సింగి ఎంపీపీలు, జడ్పీటీసీలు పేర్కొన్నారు.
జాతీయ స్ఫూర్తిని చాటాలి : డీపీవో తరుణ్‌కుమార్ ప్రతి ఇక్కరూ ఇంటిపై జాతీయజెండాను ఎగురవేసి జాతీ యస్ఫూర్తిని చాటాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్ సూచించారు. చిన్నశంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేటలో ఇంటింటికీ జాతీయజెండా పంపిణీ చేశారు. మూడు రోజులపాటు ఇంటిపై జెండా ఎగురాలన్నారు. జాతీ యజెండా పట్ల అగౌరవంగా ప్రవర్తించవద్దని సూచించారు.
తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ఇంటింటికీ జాతీ యజెండాను అందజేశారు. తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పర్యటించారు. మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో జడ్పీ చైర్పర్సన్ హేమలతాగౌడ్ ఇంటింటికీ వెళ్లి, జెండాను అందజేశారు.
