మెదక్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప, విగ్రహాలు మార్చడంలో కాదని, 14 ఏండ్ల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మను తీసేసి కేవలం చేయిగుర్తు కోసమే తెలంగాణ అస్తిత్వమైన బతుకమ్మ, కిరీటం తీసేసి విగ్రహాన్ని మార్చారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు బట్టి జగపతి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం మీడియా సమావేశంలో పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మ ఆనవాళ్లు లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ తల్లి దైవ స్వరూపిణిగా, శక్తి స్వరూపిణిగా తీర్చిదిద్ది చర్చల తర్వాత.. కేసీఆర్ హయాంలో ఆమోదం పొందిందన్నారు. దేశంలో ఆలిని మార్చిన వారిని చూశాం కానీ, తల్లిని మార్చిన వారిని చూడలేదన్నారు. దానికి తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తెలంగాణ తల్లి కోసం తీసుకొచ్చిన జీవోను అంగీకరించడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా కార్యకర్తలు, సమగ్ర శిక్షా ఉద్యోగులు రోడ్డెకారని, రైతులను నిండా ముంచుతూ ఇప్పటి వరకు రైతుబంధు, పింఛన్లు, పంట రుణమాఫీ ఇవ్వలేదన్నారు. విగ్రహాలు మార్చడంలో ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీలపై పెట్టి ప్రజలకు మేలు చేయాలన్నారు.
కాంగ్రెస్ అరాచకాలను ఎండగడుతాం: ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
రజాకార్ల సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొని కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ఎండగడుతారని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి అంటే కేవలం ఒక పార్టీకి.. ఒక వ్యక్తికి.. సంస్థకు సంబంధించింది కాదు.. మొత్తం జాతిని జాగృతపర్చిన తల్లి తెలంగాణ తల్లి.. ఈ ప్రభుత్వం అసలు బతుకమ్మనే కనపడొద్దు అన్నట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ కో కన్వీనర్లు లింగారెడ్డి, కృష్టాగౌడ్, జుబేర్ అహ్మద్, కౌన్సిలర్లు భీమరి కిశోర్, ఆరే శ్రీనివాస్, మెదక్ మండల పార్టీ అధ్యక్షుడు అంజాగౌడ్, నాయకులు ప్రభురెడ్డి, మాయ మల్లేశం, కిష్టయ్య, ఆంజనేయులు, రాజు, సంగ శ్రీకాంత్, సాంబశివ రావు, ఎలక్షన్ రెడ్డి, ప్రభాకర్, సాప సాయిలు, యాదగిరి, శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, మహమ్మద్, మోహన్ రాథోడ్, గట్టేశ్, రుక్మాచారి, రంజిత్, కిరణ్, దశరథం, అమీర్, చాంద్‌పాషా పాల్గొన్నారు.