చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం
చిరుధాన్యాలు ఆరోగ్యాన్నిస్తాయిని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కమల్వర్ధన్రావు అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యాత్రలో భాగంగా సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.
- అపరాలు…ఆరోగ్యకరం
- ప్లాస్టిక్‌ను నివారించేందుకు గట్టి చర్యలు
- కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కమల్వర్ధన్రావు
పటాన్చెరు, డిసెంబర్ 24 : చిరుధాన్యాలు ఆరోగ్యాన్నిస్తాయిని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కమల్వర్ధన్రావు అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యాత్రలో భాగంగా సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అందరి ఆరోగ్యాలకు భరోసా కల్పించే అభా కార్డులు తీసుకోవాలని ప్రజలను కోరారు. రూ.5లక్షల వరకు చికిత్స ఉచితంగా లభిస్తున్నదన్నారు. చిరుధాన్యాల వాడకం పెరగాలన్నారు. మిల్లెట్స్ సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మిల్లెట్స్ ఇయర్‌గా గుర్తించడంతో మిల్లెట్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 14.5 మిలియన్ మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు దేశంలో పండుతున్నాయని, వాటిని 25 మిలియన్ మెట్రిక్ టన్నులుగా పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
ఆరోగ్యం, విద్యపై గ్రామీణ ప్రజలు శ్రద్ధ పెట్టాలని సూచించారు. రెండు నెలలకోసారి బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. యూరి యా వాడకంతో ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయన్నారు. సుక్ష్మపోషకాలను వాడి పంటలను పండించాలని కోరారు. కర్ధనూర్ అభివృద్ధికి మారుపేరులా ఉందని కొనియాడారు. కర్ధనూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గ్రామాన్ని పారిశుధ్యంలో అగ్రస్థానంలో ఉంచామన్నారు. రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డీపీవో సురేశ్‌మోహన్, డీఎంహెచ్‌వో గాయత్రీదేవి, డీఎల్పీవో సతీశ్‌రెడ్డి, ఎంపీవో హరిశంకర్‌గౌడ్, ఉపసర్పంచ్ వడ్డే కుమార్, శ్రీరామ్ సుధాకర్, సాయికిరణ్, మోహ న్, గోపీనాయడు, బాలూనాయక్ పాల్గొన్నారు.
కొండాపూర్ దవాఖానలో సేవలు భేష్
కొండాపూర్, డిసెంబర్ 24 : కొండాపూర్ ప్రభుత్వ దవాఖానలో సేవలు బాగున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కమల్వర్ధన్రావు కితాబునిచ్చారు. ఆదివారం కొండాపూర్‌లో వికసిత్ భారత్ యాత్ర, పీఎం రూరల్ వెల్ఫేర్ స్కీమ్ కార్యక్రమంలో భాగంగా దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దవాఖానలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడగగా, బాగున్నాయని మండల వైద్యాధికారి రేష్మా అంజూమ్ వివరించారు. నూతనంగా కొండాపూర్‌కు ప్రభుత్వ భవనం మంజూరు చేయాలని కోరారు. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మంజూరయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. ఆయన వెంట మండల ఆర్ఐ రాజు, డాక్టర్ వెంకటేశ్, వైద్య సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

