జహీరాబాద్, అక్టోబర్ 23 : ఫార్మాసిటీ కోసం సేకరించే భూముల్లో పరీక్షలు చేసేందుకు వచ్చిన భూగ ర్భ వనరులు, గనుల శాఖాధికారులను భూబాధితులు అడ్డుకున్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మల్గి, డప్పూర్, వడ్డి గ్రా మాల శివారులో భూముల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వచ్చిన అధికారులను(పరీక్షల కోసం మట్టి, రాళ్లను సేకరిస్తుండగా) భూబాధితులు అడ్డుకున్నారు.
తమకు సమాచారం లేకుండా భూము ల్లో పరీక్షలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఫా ర్మాసిటీతో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలు రోడ్డున పాడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదన్నారు. తమ భూముల్లో ఎలాంటి పరీక్షలు చేయవద్దని అధికారులను అడ్డుకోవడంతో చేసేది ఏమీలేక అక్కడి నుంచి అధికారులు వెనుదిరిగిపోయారు.