Suicide | నర్సాపూర్, అక్టోబర్ 28 : చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సాపూర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ పట్టణం శివాలయం వీధికి చెందిన పిచ్కారి రమేశ్ (38) మటన్ షాప్ నడుపుతూ జీవిస్తున్నాడు. తనకు పెళ్లి కుదరడంతో పెళ్లి ఖర్చులకు డబ్బులు అవసరం ఉండడంతో స్నేహితుల వద్ద, తనకు తెలిసిన వారి వద్ద ప్రతి రోజు అడిగేవాడు.
సోమవారం నాడు బయటకు వెళ్ళి వస్తానని వాళ్ల అమ్మకు చెప్పి బయటకు వెళ్లడం జరిగింది. తన పెళ్లి గురించి డబ్బుల విషయంలో మనస్తాపం చెంది నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయారావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ వెల్లడించారు.
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహ్యత్య:
అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ పట్టణం ఎన్ జీవోస్ కాలనీకి చెందిన సయ్యద్ ఆరీఫ్ (48) గత మూడు నెలల క్రితం బైకెపై నుండి క్రింద పడి కాలికి గాయం అవ్వడం జరిగింది. అప్పటి నుండి ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. తను చేసిన అప్పుల గురించి తన భార్యకు చెబుతూ అప్పుడప్పుడు బాధపడేవాడు. ఆదివారం నాడు బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చి అప్పుల బాధతో పురుగుల మందు తాగానని తన భార్యకు చెప్పడం జరిగింది.
గతంలో కూడా చాలా సార్లు ఇలాగే అనడంతో తన భార్య పట్టించుకోలేదు. తన రెండో కుమారుడు నువ్వు చనిపోతే మేము చనిపోతామని చెప్పి తన తండ్రి సయ్యద్ ఆరీఫ్ చేతులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తాగడం జరిగింది. ఆ వాటర్ బాటిల్ లో పురుగుల మందు ఉందని గ్రహించిన ఆరీఫ్ భార్య వెంటనే భర్తను, కొడుకును నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లింది.
అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్ళగా డాక్టర్ల సూచనల మేరకు సంగారెడ్డి నుండి హైదరాబాద్‌లోని ఉస్మానియా దావాఖానాకు తరలించి అడ్మిట్ చేశారు. ఉస్మానియాలో సయ్యద్ ఆరీఫ్ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ప్రస్తుతం వారి కుమారుడు ఉస్మానియా దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు. చేసిన అప్పులు తీర్చలేకనే తన భర్త మనస్థాపం చెంది పురుగుల మందు తాగి చనిపోయాడని తన భార్య ఫిర్యాదులో పేర్కొంది.
