న్యాల్కల్, జూలై 29: మండలంలోని హు స్సేలి గ్రామ శివారులోని బీదర్-జహీరాబా ద్ రోడ్డుపై కారును ట్రక్కు ఢీకొట్టడంతో ఇద్ద రు మృతిచెందారు. ఆరుగురు గాయపడ్డారు. జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమం తు వివరాల ప్రకారం..బీదర్ పట్టణ సమీపంలో ముల్తానీ బాద్షా దర్గా ప్రాంతానికి చెందిన వారు ఆదివారం హైదరాబాద్‌లోని తమ బంధువుల వద్ద దావత్‌కు (కేఏ37ఎం 5096) టవేరా కారులో వెళ్లారు. సోమవా రం తెల్లవారుజామున వారు కారు లో తిరిగి బీదర్‌కు బయలుదేరారు.
మండలంలోని హుస్సేల్లి గ్రామ శివారులో బీద ర్ వైపు నుంచి జహీరాబాద్‌కు వస్తున్న(టీఎస్08టీ 31 98) ట్రక్కు డ్రైవర్ వేగంగా కారు ను ఢీకొట్టాడు. దీంతో కారు పల్టీ లు కొట్టి బోల్తాపడి నుజ్జునుజ్జు అ య్యింది. ఈ ఘటనలో కారు డ్రైవ ర్ సిరాజుద్దీన్, కారులో ప్రయాణిస్తున్న షాహీదాబేగం అక్కడికక్కడే మృతి చెందారు. షేక్ అయాన్ తీవ్రంగా గాయపడగా, మరో ఐదుగురు గాయపడ్డారు. జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు, హద్నూర్ పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే చికిత్స నిమిత్తం క్షతగాత్రులను బీదర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హద్నూర్ పోలీసులు తెలిపారు.