దవాఖానల్లో.. మందుల్లేవ్..
ఒకప్పుడు వైద్యు లు అందుబాటులో లేక దవాఖానల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పల్లెలోనూ, మండల కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వ దవాఖానల్లో సకల సదుపాయాలు కల్పించి, సరిపడా వైద్యులను, సిబ్బందిని నియమించడంతోపాటు అన్ని రోగాలకూ మందులను అందుబాటులో ఉంచింది.
- రామాయంపేట సీహెచ్‌సీలో రోజుకు రెండువందల ఔట్ పేషంట్లు
- విషజ్వరాలతో కిక్కిరిసిన దవాఖాన
- పేషంట్లకు మందులు సరిగ్గా ఇవ్వలేని ప్రభుత్వం
- ఏడు నెలలుగా అవస్థలతో ప్రభుత్వ దవాఖానలు
- ఏమీ చేయలేక, బయట చెప్పుకోలేక చేతులెత్తేస్తున్న వైద్య సిబ్బంది
రామాయంపేట, జూలై 15: ఒకప్పుడు వైద్యు లు అందుబాటులో లేక దవాఖానల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పల్లెలోనూ, మండల కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వ దవాఖానల్లో సకల సదుపాయాలు కల్పించి, సరిపడా వైద్యులను, సిబ్బందిని నియమించడంతోపాటు అన్ని రోగాలకూ మందులను అందుబాటులో ఉంచింది. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో డాక్టర్లున్నా, మందులు లేకపోవడంతో ప్రజలకు వైద్యం అందకుండా పోతున్నది. మెదక్ జిల్లా రామాయంపేటలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నది. అక్కడ కనీస సదుపాయాలు లేకపోవడంతోపాటు మందులు లేకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతున్నది. ఈ దవాఖానకు రోజూ 200 మంది ఔట్ పేషంట్లు వస్తుంటారు. రామాయంపేట, నిజాంపేట రెండు మండలాలకు ఒకే దవాఖాన ఉండడంతో ప్రజలు పెద్దసంఖ్యలో రామాయంపేటకు చేరుకుంటారు. దవాఖానలో బెడ్ల నిండా రోగులు ఉన్నా, మందులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు, విషజ్వరాలతో దవాఖానకు రోగు లు క్యూకడుతున్నారు. వారికి గ్లూకోజ్ ఎక్కించడంతోపాటు జ్వరం తగ్గడం కోసం మాత్రలు ఇచ్చి సరిపెడుతున్నారు. ప్రభుత్వం సరిగ్గా మం దులు సరఫరా చేయక పోవడంతో వైద్యులు అటు రోగులకు చెప్పుకో లేక ఇటు నాయకులను అడగక లేక మదనపడుతున్నారు. గత డిసంబర్ నుంచి దాదాపు ఏడు నెలలుగా ప్రభుత్వం దవాఖానలకు మాత్రలు, ఇంజక్షన్లను ప్రభుత్వం సరైన సమయం లో సరఫరా చేయలేకపోతున్నది. పరిస్థితి ఇలాగే ఉంటే రోగులే దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టే అవకాశం లేకపోలేదు.
వంతులవారీగా వైద్యుల విధులు
చేర్యాల, జూలై 15: చేర్యాల ప్రాంత ప్రజలకు సర్కారు వైద్యం సక్రమంగా అందడం లేదు. రోజూ వందల సంఖ్యలో ప్రజలు సర్కారు దవాఖానకు వైద్యసేవల కోసం వస్తున్నారు. కానీ వారికి సేవలు అందించేందుకు సర్కారు నియమించిన వైద్యులు అం దుబాటులో ఉండడం లేదు. వారంలో మూడు రోజులు మాత్రమే స్పెషలిస్టులు ఉంటున్నారు. ఆరుగురు వైద్యులు ఉన్నప్పటికీ రోజువారీగా విధుల్లో మాత్రం ఒక్కరే ఉంటున్నారు. 24 గంటలపాటు వైద్యం అందించాల్సిన వైద్యులు వంతులవారీగా విధులు నిర్వహిస్తున్నా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వాతావరణంలో మార్పులు, సీజనల్ వ్యాధులతో నిత్యం చేర్యాల దవాఖానకు జ్వరం, వాంతులు, విరోచనాలు, నొప్పులతో ప్రజలు వస్తున్నారు. ఉదయం 9 నుంచి 2 గంటల వరకు ఔట్ పేషెంట్స్‌కు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్యవసర సేవలకు వైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా దవాఖాన కొనసాగుతున్నది. పట్టణంతోపాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన ప్రజలు వైద్యం కోసం చేర్యాల దవాఖానకు వస్తున్నప్పటికీ వారికి సేవలు సక్రమంగా అందడం లేదు. రోజువారీగా ఒకే వైద్యుడు ఉంటున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

