చిన్నకోడూరు, మే 3: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. వరంగల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. చిన్నకోడూరు ఎస్సై బాలకృష్ణ వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన యాకూబ్ బాబా, యజాలి హలి రెండు కుటుంబాలు హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో రంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను వీక్షించడానికి వెళ్లారు.
మెహరాజ్ (యువతి), అర్బాజ్ యువకుడు ఇద్దరు రిజర్వాయర్‌లో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలించి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు. సిద్దిపేట ఏసీబీ మధు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు.