రామాయంపేట, ఆగస్టు 24: తల్లిదండ్రులను కోల్పోయి చిన్నారులు అనాథలయ్యారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. నా అనేవారు లేక ఇద్దరు చిన్నారులు బిక్కుబిక్కుమం టూ పూరి గుడిసెలోనే నివసిస్తున్నారు. ఉన్ననాడు తింటున్నారు.. లేనినాడు పస్తులుంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండ లం దంతెపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న జేమ్లా తండాకు చెందిన సభావత్ ఫకీరా రెండేండ్ల క్రితం కరోనా సమయంలో మృతి చెందాడు.
ఈనెల 16న తల్లి సభావత్ అంజి అనారోగ్యం తో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. వీరికి ఇద్దరు చిన్నారులు కార్తి క్, నిర్మల ఉన్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో చిన్నారులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ఆసరా కల్పించి, వారి చదువులకు సాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎవరైనా దాతలు చిన్నారులకు ఆర్థికంగా సాయం అందించి ఆదుకోవాలనుకుంటే 9346175796 నంబర్లో సంప్రదించి, చిన్నా రులకు సాయం అందించాలని తండావాసులు కోరారు.